Stock Market: ఒడిదుడుకుల మధ్య దాదాపు ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ 7 d ago
8K News-26/02/2026 ఈరోజు భారతీయ మార్కెట్లు పెద్ద మార్పులేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 27.46 పాయింట్లు (0.03%) స్వల్పంగా తగ్గి 82,248.61 వద్ద ముగియగా, నిఫ్టీ 14.05 పాయింట్ల (0.06%) స్వల్ప లాభంతో 25,496.55 వద్ద స్థిరపడింది. ఫార్మా, ఆయిల్ & గ్యాస్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, టెలికాం మరియు మెటల్ రంగాలు 0.4% నుంచి 1% వరకు పెరిగాయి. ఇక బ్రోడర్ మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.6% లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ ఎటువంటి మార్పు లేకుండా ఫ్లాట్‌గా ముగిసింది.